"భర్త" ! ఆ మాట ముందు ఇష్టాలు, ధర్మాలు , హృదయాలు, స్వేచ్చాలు, ప్రేమలు, పాపాలు అన్ని తల వంచి తప్పుకోవలసిందే..
అన్ని మతాలు తల ఒంచ వలసిందే ఆ భర్త అన్న పదం ముందు.
వాళ్ళు మాత్రం భర్తలు కారా? కాబోరా? సంసారపు హక్కుల్ని పునాదుల్ని ప్రశ్నించి ఎదురు తిరిగితే ఆడది? వాళ్ళ భార్యల మీద హక్కులు నిలవాలా ? లేదా?
అదే మగాళ్ళకు మగాళ్ళకు ఉండే కన్వెన్షన్ . ఫెయిర్ ప్లే . ఆ ప్లే లో ఆడది చేరదు. అన్నీ మగాళ్ళ క్లబ్బులు.
స్వేచ్చ స్వేచ్చ అంటాం కాని మనని బంధించి నిలబెట్టే ఈ దేశం, సంఘం, కట్టుబాట్లు, మర్యాదలు, ఈ natural laws సరిగా పనిచేస్తున్నంత సేపే, మన స్వేచ్చ వాదాలు ప్రణయాలు. శరీరం సరిగా పనిచేస్తున్నంత సేపే అసత్యాలు శరీరపు నిబంధనలకి ఎదురు తిరగటాలూ! గంతులూ !
ఎన్ని కధలు రాస్తేనేం? కలలు కన్టేనేం? కబుర్లు చెప్తేనేం? భార్య భర్తతో వెళ్లనని ఎదురు తిరిగి గతి లేదని శరణు చొస్తే..
అంతా ఎవరు ఆలోచించినా ఎంత ఆలోచించినా "నాకేం ఒరుగుతుంది , నాకేం లాభం లేదుకదా అనే కాని అమెకెట్లా ఉంటుంది అని కాదు."
"నా " అనేది మనసు నుండి వదలదు కదా..
స్త్రీల విషయం లో- అనుభవం - కొన్ని హక్కుల్ని, ఆ జన్మాంతపు హక్కుల్ని ఇస్తుంది పురుషుడికి.
చాలా సంస్కారం ఉన్న మనుషులే, ఎంతో విచక్షణ తో జీవితాన్ని చూడగల మేధా వంతులే, మనవ స్వభావాన్ని స్టడీ చేసిన పండితులే - స్త్రీ వ్యామోహం లో కాలు జారే టప్పటికి కళ్ళు కనబడక గోలుసువిప్పే వాడి చెయ్యి కరిచే కుక్కల్లగు వర్తిస్తారు..
మన ఇన్స్టింక్ట్ చేసే హడావిడి పైకి కనబడకుండా ప్రయత్నించటమే నాగరికతకు ఉండే ప్రధమ లక్షణం.
అరుణ
అరుణ గురించి వ్రాయటం అంటే ఎంత సాహసమో తెలిసి, చలం నాయికలను పరచయం చెయ్యాలనే ఉత్సాహం తో వ్రాస్తున్నాను.
స్త్రీ ని ఎవరు నదితో పోల్చారో (లేక నదిని ఎవరు స్త్రీ గా చెప్పారో) వారు ఎంత చక్కగా పోల్చారు? నది చిన్నగా బలహీనంగా సున్నితంగా మొదలౌతుంది, కొత్తనీరు వచ్చి చేరంగానే ఎన్ని కళలు పోతుంది? ఉరుకుతుంది, అటూ ఇటూ పరుగులు పెడుతుంది. ఏ ఆనకట్టలు ఆమెను ఆపగలవు? సముద్రుని ప్రేమలో మాత్రమే ఆమె తన ఉనికిని కోల్పోవటానికి ఇష్టపడుతుంది.
అలా ఎందరికో సేద తీరుస్తూ, ఆనందాన్ని పంచుతూ, గర్విస్తూ, నవ్వుతూ తుళ్ళుతూ బ్రతకాలనుకొనే స్త్రీ అరుణ. భగవంతుడు తనకు పుట్టుకతో ఇచ్చిన సౌందర్యం శక్తి ఏమిటో ఆమెకు తెలుసు. ఆమెను కట్టివేసే ప్రేమ ఈ కధ చెప్పే సమయానికి ఆమెకు అనుభవం లోకి రాలేదు. తర్వాత సంగతి తెలియదు. కనుక ఈ కధ లో గోదావరి మాఊర్లో ఇలా ఎగిరి ఎగిరి పడింది అని చెప్పినట్లు, కృష్ణమ్మ మా గ్రామంలో ఇన్ని కళలు గా ఉన్నది అని చెప్పినట్లు, కొన్ని రోజుల సమయంలో అరుణ ఇలా ఉన్నది అని కధకుడు మనకు చెప్ప చూస్తాడు 'అరుణ' అనే పుస్తకం లో .,
అరుణ పరిచయం ఎంతో సింపుల్ గా మొదలయ్యి చదివేవారిని కంఫ్యూజన్ కి గురిచేసి చివరకు ఆమె ఆలోచనల్లో ఉన్నత తత్వాని మనకు పరిచయం చేస్తూ అయిపోతుంది.
మధ్యలో మగవాడికి, అది ప్రియుడైనా భర్తైనా స్త్రీ పై ఉన్న ప్రేమ ఆమెను కట్టి వేసి ఇది తన వస్తువు అని గొప్పగా చెప్పు కోవటానికేనా అన్న చిట్టి ప్రశ్నలు తనదైన శైలి లో అడుగుతూ కుదుపుతూ సాగుతుంది ఈ చలం రచన. పాత కట్లుబాట్ల కి, సంఘం పురుషుడికి ఇచ్చిన హక్కులకు, ఆర్ధికం గా ఏ ఆధారం లేని అరుణ లొంగక, రహస్య జీవనాన్ని ఇష్టపడక స్వతంత్రాన్ని కోరుకోవటం, ఈ ఆలోచనను ఎంతో విశాల భావాలు ఉన్న రచయిత కూడా హర్షించలేక పోవటం, దుడుకు స్వభావులైన ఈమే ఆరాధకులు సైతం భర్త అన్న పదానికి ఇచ్చే గౌరవం లాంటివి వివరిస్తూ మగవారి ఆలోచనా విధానాన్ని, అంతర్లీనంగా ఆ ఆలోచనల వెనుక స్వార్ధాన్ని చూపిస్తాడు రచయిత.
ఎటువంటి నిర్ణయం తెసుకొన్నా అది ఆమె స్వంత నిర్ణయం, ఫలితం ఆమెది, ఆమె నిర్ణయం పై ఆంక్షలు పెట్టే అధికారం సమాజానికి ఎక్కడిది అనే సామాజిక కోణం, అరుణ రూపంలో స్త్రీ లోని స్త్రీత్వాన్ని చూపించటం, దానిపట్ల తనకు గల గౌరవాన్ని చూపటం ఈ నవలలో ముఖ్యంగా నాకు కనిపించిన అంశాలు.

కళ్యాణి
కళ్యాణి అనే పేరుతొ అరుణ పబ్లిషింగ్ వారి పుస్తకం లో కల్యాణి అనే కధ గూర్చి క్లుప్తం గా..
కళ్యాణి కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిగా బ్రతుకుతూ ఉంటుంది. తన గతం చేసిన గాయాల వల్ల కావచ్చు తను మగవారంటే విముఖం గా తనకు వచ్చిన కొద్ది పాటి సంగీతాన్నీ రేడియో లో పాడి జీవితం వెళ్ళ దీస్తూ ఉంటుంది. కాని ఆమె అందానికి ఆమె పాటలోని సహజత్వానికి ఎందఱో ఆకర్షితులు అవుతూ ఒంటరి గా ఉన్న ఆమెను పొందటానికి, ఆమె పాట ద్వారా సంపాదించు కోవటానికి ఆమెను వేధిస్తూ ఉంటారు.
హీరో మధ్య తరగతి జీవనం గడుపుతూ కళ్యాణి పాటలు రేడియో లో విని ఆనందానికి లోను అవుతాడు. ఆమె పాట లోని గొంతులోని ఆకర్షణకు ముగ్డుదయ్యి ఆమెను ఆరాధిస్తూ ఉంటాడు. ఆమె కోసం తన పరిధి లో రేడియో కి ఉత్తరం రాయటం లాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసి ఆమెని అందని పండు గా భావించి అందమైన ఊహలతో కవితలు వ్రాస్తాడు.
ఒకసారి అనుకోకుండా కలిసిన తన స్నేహితుడు ధనవంతుడైన దోరైకన్ను తన కవితలు ప్రచురిస్తానని మాట ఇస్తే అతనికి ఆ కవితలన్నీ ఇచ్చేస్తాడు. అయితే తర్వాత మద్రాసులో స్నేహితుల ద్వారా కళ్యాణి గూర్చి ఆమె దక్కని వారు ప్రచారం చేసిన స్కాన్డల్స్ విని ఆమెను గూర్చి తాను కూడా చులకన గా భావించి ఆమెను, తన భావా వేశాలను, తన కు ఎంతో ప్రియమైన తన కవితలను మర్చి పోయి సంపాదనాసక్తి లో పడతాడు.
బాగా డబ్బు సంపాదించిన తర్వాత తన కవితలు ప్రచురించి పేరు, డబ్బు సంపాదించవచ్చు అన్న ఆసక్తి తో దోరైకన్ను ను వెదకి కలుసు కొంటాడు . అక్కడ దోరైకన్ను తను రాసిన కవితల ద్వారా కళ్యాణి గొప్పతాన్ని తెలుసుకొని ఆమెను ప్రేమించి ఆమె కోరిక పై ఎవరికీ తెలియని ఒక ద్వీపం లో ఆమెతో ఉండటం చూస్తాడు.
భావుకత్వం తగ్గి డబ్బు, పేరు ప్రఖ్యాతుల పై మనసు మళ్ళిన ఇతనికి దోరైకన్ను, కళ్యాణి చేసిన పని వింతగా తెలివితక్కువ తనం గా అనిపిస్తుంది. కళ్యాణి నటి గా, దోరైకన్ను మంత్రి గా చక్కటి భవిష్యత్తుని నాశనం చేసుకొన్నారని ఎగతాళి చేసి వారు ఉండే ప్రశాంతమైన ప్రదేశం నుంచి వచ్చేస్తాడు. దోరైకన్ను వ్రాసిన ఉత్తరం, ఇచ్చిన 50 వేల చెక్కును చూసినప్పుడు తను పోగొట్టుకోన్నదేమిటొ తెలిసినట్లనిపిస్తుంది.
అందం ఉన్నది ఆనందించటానికి కాని అమ్ముకోవటానికి కాదు అన్నది కధా సారాంశం. నాకు Guide (R. K నారాయణ్ గారి నవల, దేవానంద్, వహిదా సిన్మా) గుర్తుకు వచ్చింది.
అన్నట్టు ఈ కధ నేను దూరదర్సన్ లో ప్రసారమైతే చూసాను. కాని చలం వర్ణించిన అందమైన ప్రకృతి ని, పాటను చూపించాలంటే వారి చిరు బడ్జెట్, చెత్త కెమెరాలు పనికి రావు. మనసు పెట్టి తీయాలి ఈయన కధల్ని.

చలం రాజేశ్వరి
చలం కి చాల చెడ్డ పేరు తెచ్చి పెట్టిన నాయక రాజేశ్వరి.
ఆమె సంఘం మెచ్చ లేని పనులు ఒకటి కంటే ఎక్కువ చేసింది. ఈమెలా ప్రతి స్త్రీ బంధనాలు తెన్చుకొంటే , తెగిస్తే సమాజం ఏమయి పోతుంది అని భయ పడేట్లు ఉంటాయి ఆమె చేష్టలు. కనుకనే పురుషులే కాదు స్త్రీల అభిమానాన్ని కూడా నోచుకో లేక పోయింది పాపం రాజేశ్వరి.
చలం అభిమానులు చలం ఇతర నవలలు చదివిన వారు, చలం ని సమర్దించటం కోసం ఆమెను చలం కల్పనగా చెప్తారు. ఇలా జరగచ్చు కనక మీ పెళ్ళాలను ప్రేమ గా చూడండని చెప్పినట్లో, ప్రేమికుడు కూడా మగ వాడే కనుక వెళ్లి పోయిన తర్వాత కూడా సమస్యలు తప్పవనో చెప్పినట్లు గా అంటారు.
దైవ మిచ్చిన భార్య లోని పద్మావతి లా ఈమె సమాజం కోసం ప్రేమను కప్పివేయ లేదు. ఒకే ప్రేమికుడు కలదీ కాదు. అందునా ఆ ప్రియులూ ఈమకు తొడు పోయిన వారే సమాజం లో ఉన్నతులు కాదు.
అత్యంత వివాదాస్పదమైన ఈమె చలం జీవితం లో చూసిన స్త్రీల లో ఒక స్త్రీ కి రూపు మాత్రమే. చలం అద్రుష్టం కొద్ది నో దురదృష్టం కొద్ది నో సంఘం లో వెలివేయబడ్డ వారితో సహచర్యం చేసారు. (చెయ్య వలసి వచ్చిందన వచ్చు. ఈయన కూడా వెలి వేయ బడ్డ వాడె కదా ). ఈ ప్రక్రియలో ఆయన చూసిన స్త్రీ ల లోని ప్రేమ ఆయన్ను ఆశ్చర్యానికి గురి చేసింది . ప్రేమ తప్పితే మిగిలిన వన్ని కంటికి కనిపించని , మనసు మాట మాత్రమె వినే స్త్రీలను అయన గౌరవించారు.
రాజేశ్వరి ప్రేమ లేని చోటు నుండి ప్రేమ గల చోటుకి రావటం, ఆ చోటులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన మార్గమే సరైనదని అనుకోవటం మాత్రమె ఈ పుస్తక సారాంశం. ఆ పరిస్థితుల్లోకి మనం జొరబడి, ఇలా అయితే నేను ఎలా స్పందిస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. మన పక్క వీధుల్లోని రాజేస్వరులను రాళ్ళతో కొట్టక , వెనక వీధిలో మన్మధ రావు ని accept చేసినట్లు, accept చెయ్యమని. వేలైతే ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వమని ఆయన ఉద్దేశ్యం.
సమాజానికి అటువంటి స్త్రీలను పరిచయం చెయ్యటమే ఆయన ఉద్దేశ్యం. కోఠి లలో ఉండే స్త్రీలలో మనసు ఉంటుందని, వాళ్లు మామూలు చదువుకొన్న స్త్రీల కంటే మంచి వారని వచ్చిన ప్యాసా (మల్లెపూవు), ముకద్దర్ కా సికందర్, ఉమ్రావ్ జాన్ లాంటి వేళ కధాంశాల వంటిదే ఇదికూడా.

విషాదం
ఒక్కక్కప్పుడు ఆలోచిస్తే, ఈ ఇతరుల మీది భయం (మనుషులకు ) పొతే నిజమైన ఆనందం ఎంత కలుగుతుందా, ఎన్ని బాధలు ప్రజలకు పోతాయా అని అనిపిస్తుంది.
సత్యాన్ని ఆచరించే ఆరోగ్యమైన బలమైన సంఘం లో నీతి అవినీతి అనే కృత్రిమత ను తీసివేసి అందరూ సహజంగా ఉంటే ఈ దొంగ వేషాలు కల్మషాలు ఉండవు. తమ ప్రకృతి ఎలా ఉంటే అలాగే కనపడటం తప్పు కాదనే సదభిప్రాయం ఒచ్చిన నాడు , ఎంత ధర్మం ఎక్కువవుతుందో ఈ లోకంలో.
జ్వరం వస్తే దాచడు . పైగా కనపడ్డ ప్రతివాడితోనూ చెప్పుకొంటాడు. ఈర్ష తో కాని లోభం తో గాని బాధ పడుతూ ఉంటే అవి దాచేందుకు ఎన్ని వంకర్లో తిప్పి బాధ పడతాడు. ఎప్పటికి ఈ భయాలు పోయి ఈ కృత్రిమ జీవనం లోనించి బైట పడి సహజంగా నిజమైన సౌఖ్యాన్ని, నిజమైన బాధల్ని అనుభవించ గలుగు తామో !

పురూరవ (1927)
ఊర్వశి : ప్రేమవల్ల నీకు ఏమి వచ్చింది?
పురూరవ: సుఖం
ఊర్వశి: అంతేనా? నరకం వచ్చిందా? విజ్ఞానం కలిగిందా? ప్రేమ అంటే నీకు ఏమి తెలుసు? నీ ద్రుష్టి ఇంకా విశాలం కాకుండా ఉంటుందా ? నిజంగా ప్రేమిస్తే?
మరి ప్రేమంటే ఏమిటను కొన్నావు?
నిన్నటి నుంచి నివు వినిపించిన ప్రేమ గీతాలు రాయటమూ, పాడ టమూ అనుకొన్నావా?
చెప్పావు గా గడచిన నీ ప్రేమ కధలు, ప్రేమంటే, ఆశించి స్త్రీ నీ ఆలింగనం లోనికి వస్తే ఈ భారమూ లేకుండా అనుభవించటం అనుకొన్నావా?
కంటికి బాగున్న స్త్రీ నల్లా నీ పాన్పు మీదికి ఆహ్వానించటం అనుకొన్నావా?
స్త్రీ సౌందర్యం ఎందుకు సృష్టించ బడిన్డను కొన్నావు?
పురుషున్ని కాల్చి మెడ వంచి, కళ్లు తెరచ టానికి .
అతని ఆత్మని అతనికి చూపటానికి.
తక్కిన ఆలింగానాలన్ని సృష్టి జరప టానికి .

చలం గారి ఉత్తరాలు (1947 -1977)
సూర్యుడు తప్పదు. ప్రతి ఉదయం వెలిగిస్తాడు. కాని మళ్ళీ సూర్యుడు దర్శనం ఇచ్చాడే అన్న సంభ్రమం కొత్తగా ఫీల్ కాక పొతే హృదయం చచ్చి నట్లేగా ? అలాగే మిత్రుల నుంచి వాక్కు విన్నప్పుడల్లా .
చలం గారి ఉత్తరాలు (1947 -1977)
పరిస్థితులు ఎప్పుడూ అట్లనే ఉంటై. మనసు అట్లా తిక మకలు పెడుతూనే ఉంటుంది. ఈ రెండిటినీ ఉపేక్ష చేయగల బలం కావలి. కాని అదే అసాద్యం. అందువల్ల అశాంతి . అదే మానవ జీవితం.
హాయిగా లేకుండా ఉండటం ఒక సుగుణం. బైట పరిస్థితుల వల్ల కాక అసలు లోపలనించే అశాంతి పుట్టుకు రావాలి. హాయిని కోరు కొంటాం కాని హాయి మృత్యువు. అదీ నా వేదాంతం . బాధ వల్ల చికిత్స కోసం వెతుకుతాం. గట్టి గా వెతికే వాళ్లకు అది దొరుకుతుంది.

చలం గూర్చి శ్రీ B. V. నరసింహ రావు గారు..
చలం గూర్చి శ్రీ B. V. నరసింహ రా గారు చెప్తూ , (ref ఆడియో లింక్ )
సంఘం గూర్చి..
చలం సంఘ విరోధి కాదు. సంఘ మిత్రుడు.
సంఘ ద్వేషి కాడు. సంఘ సంస్కర్త .
సంఘాన్ని తిడుతున్నాడంటే సంఘం లోని దుర్మార్గుల్ని వంచకుల్ని అతడు తిడుతున్నా డన్న మాట .
హృదయమున్న వాళ్ళకే కదా అతని మొర అంతా.
స్త్రీ గూర్చి
స్త్రీ శక్తి ని ఆరాధించటం వల్ల ప్రేమకు ఆద్యత్మికోన్నతి సిద్దిస్తుందని, స్త్రీ శక్తిని ఆరాధించటం దివ్య శక్తిని ఆరాధించటానికి
తోలిమెట్టని వివరించారు.
స్త్రీ కొరకే కాక తన కొరకే పురుషుడు తన లోని పశు ప్రవృత్తిని తొలగించు కొనుట కొరకే స్త్రీ ని కి స్వేచ్చ నివ్వాలని ఆరాధించాలని చలం గారి అభిమతం.

చలం ఉత్తరాలు (1952-1979)
మీకోసం ఈ ప్రకారం లోకాన్నే మార్చాలా మనకు అనుకూలం గా? అంత కన్నా మీ ఒక్కరిని మార్చటం సులభం. అదే ఈశ్వరుడు చెయ్య బోతున్నది.
లోకాన్ని మించాలి. కాని లోకాన్ని వదిలి పరుగెత్తటం పిరికి తనం.
ఇది దీరత్వమా? తను తెచ్చుకొన్నది, నిర్మించు కొన్నది మనకు సౌఖ్యం ఇచ్చినన్నాళ్లేనా?
బాధ కలగ గానే ఒదిలించు కోవాలని చూడటమా?
బిడ్డను కనేది, ఏడిస్తే అల్లరి చేస్తే, తన్నేది, ఇంకా చాత కాక పొతే సన్యసించేదా ??
చాల భీరుత్వం ,అపచారం అది.
(ఆద్యత్మికాన్వేషణ లో ) మీ బంధువుల్నీ, మర్యాదల్నీ వదిలారనేది ఓ గొప్ప అర్హత. అది ఒదిలిన వాళ్లకు తక్కినవి ఒదలటం ఓ కష్టం కాదు.
కానీ వదలటం అంటే భౌతికం గా ఒదలటం కాదు. మనసులో పట్లు పోవటం ముఖ్యం. పట్లు వదులుకోవటానికి కొంత వరకైనా సిద్దం గా ఉండటం. పోనీ అవి వదిలితే బాడున్డునని వాంఛ ఉండటం.
అప్పుడు మామూలు శరీర మానసిక ఆకర్షణ నుంచి ఉన్నతం గా ప్రేమించ గల శక్తికి కళ్లు తెరుచు కొంటాయి. ఇది బూడిద బైరాగి తనం కాదు. అన్నిటినీ include చేసుకొనే ఒక విశ్వ ఆలింగనం.
ఇప్పటిమల్లె సంకుచితం గా, ఇరుకుగా కాక విశాలంగా ప్రేమించ గల దృష్టికి లిఫ్ట్ కావటం, ఎక్ష్పన్ద్ కావటం.
(ఆద్యాత్మిక అన్వేషణ అనే ) ఈ అగ్ని దీక్ష లో నిజమైనవి నిలుస్తాయి. ఊగేవి ఊడతాయి. మనం ఎంత నిజమని గోల పెట్టినా అబద్దాలు కాలి పోతాయి. మోసాలు తెగుతాయి.

చలం ఉత్తరాలు (1952 - 1979)
మీరు చేసిన అపచారమా? అపచారాలే లెక్కకు తెసుకొంటే ఎన్ని జన్మల్లో ఎన్ని అపచారాలే చేసారో మీకు ఎలా తెలుస్తూంది? కర్మ ఈశ్వరుడే. ఆయన్ను మించింది లేదు.
ఈశ్వరుడు మనసునుండి తొలగి నప్పుడే పాపం, కర్మ, గ్రామ దేవతలు వచ్చి భయ పెడతారు.
ఈశ్వరుడు మనసునుండి తొలగి నప్పుడే పాపం, కర్మ, గ్రామ దేవతలు వచ్చి భయ పెడతారు.
చలం ఉత్తరాలు (1952 - 1979)
మతి స్తిమితం లేక పోవటం గొప్ప వరం. మతి స్తిమితం గల మనుషులకి టీచర్లు కానీ, మంత్రులు కాని , ఎట్లా వాళ్ల జీవితాలతో తృప్తి పడి కొవ్వెక్కి సుఖం లో కూరుకు పోయి నిద్ర పోతున్నారో చూడండి.
జీవితం కాల్చుకు తింటే గాని ఎక్కడ ఎక్కడ అని పరుగెత్తం .

ప్రేమలేఖలు (1922)
ముందే ఆలోచించి నిశ్చయించు కొంటె కాని అబద్ధం తలపుకు రావటమే కష్టం నాకు. ఈ లోపం వల్ల ఎన్ని చిక్కుల్లో కి దిగాను.? ఎంత మందిని దింపాను? కొంత మంది చక్కగా నిజం వలె తడుముకో కుండా నిజమే నని నమ్మేట్లుగా అబద్ధం చెప్పగలరు. అదృష్టవంతులు.
ప్రేమలేఖలు (1922)
ప్రేమలేఖ అంటే ప్రియ మైన మిత్రులకి రాయటం. పురుషులు గాని స్త్రీలు గాని సెక్స్ బేధమైనప్పుడు ప్రేమలో వలెనె లేఖలో కూడా రొమాన్స్ , పొయిట్రీ, tenderness ఎక్కువగా కానీ పిస్తాయి. లేఖలు ఎక్కువ అందం గా ఆకర్షణీయం గా ఉంటాయి.
ప్రేమలేఖలు కానివి పోస్టులో రోజూ వెళ్ళే లక్ష ఉత్తరాలు అన్నీ చెత్త , చికాకు వ్యవహారాల కోసం, దొంగ మర్యాదల కోసం, తగాదాలు, నోటీసులు ఈ రకాలు.
మొత్తనికి విసుక్కొంటూ రాసేవి ఏడుస్తూ చదివేవి గా ఉంటాయి.
నిర్వాజమైన స్నేహం ఉంటే గానీ, స్వచ్చమైన హృదయాలు ఉంటేగాని, మధుర మైన లేఖలు పుట్టవు. అట్లాంటి స్నేహం ఉన్నా ఉత్తరాలలో ఆ సంబంధాన్ని వ్యక్త పరుచుకొనే అభిలాష గాని, అభిరుచి గాని, శక్తి గాని ఉన్నవారు అరుదు.

దిక్కు మొక్కు లేని అర్థం లేని, దరి దాపూ లేని బాధ పడటం వేరు, ప్రతి బాధ తోనూ అవతల గట్టు కు దగ్గర అవుతున్నామని, ఈశ్వరుడు కనిపెట్టి ఉన్నదని విశ్వాసం తో బాధ పడటం వేరు.
దెబ్బ తగిలితే వచ్చే బాధ వేరు. వ్యాయామం లో మనం పడే బాధ వేరు.
కష్టాల నుంచి తప్పించమని కాదు ప్రార్ధన . వొచ్చాక ఆ కష్టాలను నిర్లక్ష్యం గా ఒర్చుకొనే శక్తిని ఇమ్మని.
కష్టమే! కాని కష్టం లేనిది ఏది రాదు. వచ్చినా వచ్చేవి విలువ లేదు.

ఈ హర్మ్యలూ ఈ వనాలూ వీటిని నిర్మించిన నీ సౌందర్య భావం, ఐశ్వర్య వైభవం నీలో కాక వాటిలో కనబడితే నిన్ను ఎవరు ప్రేమిస్తారు? తమ భర్తల్లో ఆ విశాలత్వం, గర్వం, ఘనతా కనపడకనే స్త్రీలు తమ భర్తల్ని కాక వాళ్ల ఐశ్వర్యల్ని , కీర్తిని ప్రేమిస్తారు.
కార్య శూరత్వం మనిషికి నైతికాభివృద్ది ని ఇవ్వాలి .

బిడ్డల శిక్షణ (1924)
బిడ్డల కన్నా ఇతరమైన, బిడ్డ కన్నా శ్రేష్ట మైన అవసరాలూ, విలువలూ ఉంటే బిడ్డను కనకండి.
మంచి శిక్షణ కు ఉత్త ప్రేమ మాత్రమే చాలదు.
ఆ ప్రేమను క్రమమైన మార్గాల ద్వారా ఉపయోగించి బిడ్డ క్షేమనికి ప్రయత్నించేది జ్ఞానము. ఈ జ్ఞానానికి చోటు లేకుండా చేసి తరిమేస్తుంది సెంటిమెంట్ .
కానీ వాస్తవమైన ప్రేమ ఉంటే జ్ఞానానికి స్తలముంటుంది.
ప్రేమ లేకుండా ఉత్త జ్ఞానమున్న చాలదు. అప్పుడు ఇల్లు ఒక హాస్టలు లాగ ఉంటుంది.
ప్రేమకన్నా జ్ఞానం ముఖ్యం. అంతకన్నా రెండూ కలిసి ఉండటం ముఖ్యం.
బిడ్డను తగిన శిక్షణ లో ఉంచితే ఈ బిడ్డ పెద్దదైనప్పుడు ఇప్పుడు ప్రజలకి ఉండే మూధత్వమూ, భయమూ కలిగి ఉండక ఉన్నతురాలు అవుతుంది. ఆ నైసర్గిక స్వభావోన్నత్యాన్ని బిడ్డలకు ఇవ్వగలిగితే చట్టాల వల్లా, సంస్కారాల వల్లా, బోధనల వల్లా కలిగించ తానికి ప్రయత్నించే మార్పులు ఏ శ్రమా లేకుండానే ప్రజలలో తటస్తిస్తాయి.

పిల్లలకు వాళ్ల దేహం మీదా శీలం మీదా అమితమైన గౌరవం ఉండాలి. ప్రేమా, ఇతరులు ప్రేమించటం అనే అనుభవం అతి అద్భుతం గాను ఉన్నతం గాను కనపడాలి. వారికి సంపూర్ణం గా ప్రేమిస్తేనే గానీ తమ మనసంతా అర్పిస్తేనే గాని దేహాన్ని స్వాధీనం చెయ్యటం అతి నీచమని తెలియాలి.
చలం ఉత్తరాలు (1952-1979)
ఒక అతన్ని మరొక వ్యక్తి అడిగాడట , బాబు! నీవు ఇంతగా దేవుణ్ణి నమ్ముతున్నావు, నీ కొడుకు చనిపొయ్యాడు కదా ఇక నైన దేవుణ్ణి నమ్మకుండా వుంటావా అని, "అయ్యా పోయిన కొడుకు పోనే పొయ్యాడు ఉన్న ఒక ఆధారము కూడా పోగొట్టుకోమంటారా? " అన్నాడట.
దేవుడు ఈ కష్టాలు ఎందుకు తీర్చటం లేదు?
అమ్మ ఎంత ఆకలి వేస్తున్నా ఎందుకు అన్నానికి పిలవట్లేదు అంటే ఈ రోజు పండగ అన్నమాట. అమ్మ మనకోసం చాల చాల తీపి వంటకాలు చేస్తున్నది
(ఈశ్వరుడు ) ఎవరికి గట్టి ఉపకారం ముందుకాలం లో చేయ్యతలుచు కొన్నారో వారి యడల కఠినత్వం చూపుతారు . వాళ్ళని కఠినమైన discipline లో ఉంచుతారు.

దైవమిచ్చిన భార్య
హృదయం లో అతుక్కొని ఉంది ఆమె రూపం. ఒట్టి శరీరం అందం చూసి మొహించననచ్చు. ఆ శరీరం లోనించి, కళ్ళ లోనించి, మాటల్లో నించి చూసాను ఆమె ఆత్మ ఔన్నత్యాన్ని.
మెల్లి మెల్లిగా ప్రేమ సంపాదించటం దొంగ చూపులూ, దొంగ మాటలు ప్రయోగించటం, రెండో వారి అభిప్రాయం ఎలా ఉన్నదో కనుక్కోవటం, భయపడటం, సూచించటం, అనుమానించటం, ఆశలూ, నిరాసలూ, దొంగతనం, అబద్దం, మెల్లిగా మనసు లాగటం, తప్పు అభిప్రాయాలూ ప్రవేశ పెట్టటం ఇవన్ని మాలో ఎన్నడూ లేవు. మా ప్రేమ తప్ప ఇంకో ఆలోచన మాకు తట్ట లేదు. నేను బ్రతకటం, గాలిని, ఎండని అనుభవించటం ఎంత సహజమో పద్మావతి ని ప్రేమించటం కూడా అంట సహజమే. ప్రేమ గల స్నేహుతురాలు అంతే.
ఈ లోకము సంగతి తెలియదు నీకు. అనుభవం తక్కువ నీకు.
ఏమిటి కలిసి ఉంటే మాత్రం, ఈ శవాలు అన్నిటికి ప్రేమే?
ప్రేమ ఉంటే వాళ్ళ మొహాలు ఎందుకు ఏడుస్తూ అలా ఉంటాయి?
ప్రేమ జ్యోతి వెలిగే హృదయాల మీద మబ్బు పొర రావటం సాధ్యమా?
అనుమానాలు, అధికారాలు, రహస్యాలలో బతికే వాళ్లకు ప్రేమంటే ఏమి తెలుసు?
నిన్ను చూస్తె అప్పుడప్పుడు నీ తల్లి నైతే ఎలా ఉండేదో అట్లా అనిపిస్తుంది . ఇప్పుడు మరీ అట్లా అనిపిస్తుంది.

చిన్నతనం చాల సంతోషమైన కాలం అంటారు. హాయిగా చీకూ చింత లేకుండా భోజనం, చిరుతిండి బట్టలు ప్రేమగల దేవత మాకు సంసిండ్డం చేసి ఇస్తుందనే ఉద్దేశ్యం తో తిరగటం ఆడుకోవటం బాగా ఉంటుంది.
ఈ పెద్దవాళ్ళు ఎందుకో చిదరించు కొంటూ కోప్పడుతూ, ఏడుస్తూ బ్రతుకుతారు. అట్లా బతకక పోతేనేం?
ఆకాశం మబ్బులూ, పువ్వులూ, చిలకలూ, రైళ్ళూ , నీళ్ళూ ఇన్ని ఉండగా ఈ పెద్దవాళ్ళకు సంతోషం లేక పోవట మేమా అని సందేహం.

ఆనందం
నాకు ఆనందం కావాలి ,, నేను ఆనందం అనుభవించాలి అని ప్రయత్నిస్తే ఆనందం వచ్చేట్టు కనపడదు..
ఒక కార్యం ద్వారానే కల్గుతుంది ఆనందం.. మనసు ఆ కార్యం మీదనే ఉండాలి కానీ ఆనందం మీద ఉంటె ఆనందం చెదిరిపోతుంది..తీపి కావాలన్నా వాడు తీపి కోసం వెతికితే ఎక్కడన్నా కనపడుతుందా .. చెరుకు కోసం వెతకాలి కాని..
ఒక యోగి వచ్చి ఆసనం చుఇపగానే అందరు ఆసనాలు ప్రారంభిస్తారు.. ఇంకో పండితుడు వచ్చి జుట్లు కోరిగించ మనగానే అందరు జుట్లు గోరిగిస్తారు..
ఉద్యోగం చేస్తూ ఎన్నడు నవ్వని దురదృష్ట వంతుడు..ప్లేదరై కవుల వెంట తిరిగే రసికుడు.. పెళ్లి చేసుకొని నమ్మకంగా నిలువ లేని స్త్రీ ... ఇలా అందరూ తమ ఆనందమేదో తెలియని మూర్కులు..
తమకి లేని వొస్తువ తమకి ఆనందం ఇస్తున్డను కోవటం పెద్ద భ్రమ..

తనకి బాధ కలిగించే పనులనుండి మన శరీరం తనంతట తనే తప్ప్పుకుంటుంది..
కానీ మనసుకి మాత్రం అ నేర్పు ఇంకా రాలేదు..తనకి ఏది అనడం ఇస్తుందో.. ఆ బాధల ఎట్లా నుంచి తప్పుకోగాలరో మనుషులు ఇంకా నేర్చుకోలేదు.కనకనే ఎవడు వచ్చి " ఆనందం " అని కేకలు వేసినా వాడి వెంట పరిగెత్తుతారు..

స్త్రీ
స్త్రీ ఒక మాటవల్ల చూపువల్ల పురుషునికి సందిచ్చిందా - ఇంక అతని అధికారానికి ప్రార్ధనలకి, కోరికలకి అంతం వుండదు.
దైవమిచ్చిన భార్య
స్త్రీలు లు ఎందుకనుకోన్నావు ఉన్నది. జీవితమంటే ఎంత ఉన్నత మైనదో గాధ మైనదో పురుషునికి తెలిసేట్టు చెప్పేందుకు. పురుషుడిని ప్రోత్సహించాలి. స్వర్గానికి ఎత్తివేయాలి. గొప్ప పనులకు, గొప్ప ఆదర్శాలకు, గొప్ప ఊహలకు ఉత్సాహం ఇవ్వాలి. అగ్ని తో నిమ్పేయాలి. నిర్జీవమైన బ్రతుకు లోనించి రక్షించాలి.
వగ్దత్తం చెయ్యి. ఎప్పుడూ ఈ సామాన్యపు దేశ సేవకుల మల్లె తుక్కు కింద, ఏడుపు కింద, శవ ఆకారం కింద తాయారు కానని. , వెధవ బ్రతుకు, పాడు మొహాలు వేసుకొని కళ్ళ మీద పొరలు కమ్మి కుళ్ళు నవ్వులు నవ్వుకొంటూ మర్యాదలో, గౌరవం లో, భయం లో, పిరికి తనంలో, ధర్మాచరణం లో, సనాతన ధర్మం లో, మత్తులో, కొంచం కొవ్వెక్కి, గుండ్రంగా తయారై, పిర్రలు బలిసి అలా బ్రతకనని ఒట్టేయ్యి.

మ్యూజింగ్స్
ఇప్పుడు లోకం ఎంత దుస్థితిలో వుందంటే శాస్త్రవచనాలను అన్గికరిస్తూ వాటికీ విరుద్ధంగా ప్రవర్తించటం వోప్పుకుంటుంది. వాటికీ విరుధంగా ప్రవర్తించక పోయిన అ వచనలంతే నాకు లక్ష్య లేదంటే శిక్షిస్తుంది.
ఆనందం
"తనే ఆనందం పొందాలి అనే కార్యాల కన్నా .. ఇతరులకి ఆనందం ఇద్దామన్న ఉద్దేశ్యంతో చేసే కార్యాలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి..
ఆనందం
సాధారణంగా మనుషులు ప్రేమ అనుకునేది ప్రేమకాదు. కామాన్ని, అలవాటునీ ప్రేమ అనే పేరుతొ పిలుస్తారు. మొహం కన్నా చాలా అతీతమైనది ప్రేమ . మొహంలో వలె ప్రేమలో శరీర వాంఛ ముఖ్యం కాదు. శరీర వాంఛ ఉండవచ్చు కాని దానికన్నా ఎన్నో రెట్లు తక్కిన ఆకర్షణలు బలంగా ఉంటాయి. మొహం కలవాళ్ళు రెండో వాళ్ళని తమ సౌఖ్యం కోసం కోరతారు. తమకి దక్కనిదైతే ఆ మనిషి మీద మొహం చచ్చిపోతుంది. ప్రేమ గలవారు తాము రెండోవారికి గల ఆనందాన్ని గూర్చి ఆలోచిస్తారు. తమకీ వారివ్వగల ఆనందాన్ని గూర్చి తలపరు. రెండో వారి ఆనందంలో తాము ఇక్యమవుతారు. తమని ప్రేమిచకపోయినా వీరి ప్రేమ పోదు. ప్రేమకి పూజ్య భావం ముఖ్యం. గౌరవము, భక్తీ లేనిదే ప్రేమ కాదు. తమ మనస్సులో తోచిన సెంటిమెంట్లని, బలహినమైనటువంటి తాత్కాలిక ఆకర్షనలనీ , వాంఛల్నీ ప్రేమ అనుకుంటున్నారు. ఇటువంటి ప్రేమ వెతికితే రాదు. తమ సంస్కారం చేత , స్వభావోవ్నత్యం చేత ఇటువంటి ప్రేమకి అర్హులవ్వాలి.
చలం ఉత్తరాలు (1952-1979)
మనసు మారకుండా . ఆత్మ అభివృద్ధి చెందకుండా , ప్రపంచం అంటే ఏమిటో అర్థం కాకుండా ..కేవలం కొన్ని తీర్థాల వల్లా ,కర్మల వల్లా..పూజల వల్లా మంత్రాల వల్లా దేవుడి దయ సంపదిచ వచ్చు ననే నమ్మకం ..ఈ లోకంలో ఎ గొప్ప విషయం అర్థం కాని మూర్ఖుడికి ఈశ్వర జ్ఞానం కల్గుతుందట..
సాటిమనిషిని ప్రేమించలేని వాడికి ముక్తి దొరుకుతుందని ఆశ ..
ఈశ్వరుడి దగ్గర ఆయినా మన self respect మనకి ఉండాలి. దేవిరించ కూడదు.

Subscribe to:
Posts (Atom)