చలం రాజేశ్వరి

చలం కి చాల చెడ్డ పేరు తెచ్చి పెట్టిన నాయక రాజేశ్వరి.

ఆమె సంఘం మెచ్చ లేని పనులు ఒకటి కంటే ఎక్కువ చేసింది. ఈమెలా ప్రతి స్త్రీ బంధనాలు తెన్చుకొంటే , తెగిస్తే సమాజం ఏమయి పోతుంది అని భయ పడేట్లు ఉంటాయి ఆమె చేష్టలు. కనుకనే పురుషులే కాదు స్త్రీల అభిమానాన్ని కూడా నోచుకో లేక పోయింది పాపం రాజేశ్వరి.

చలం అభిమానులు చలం ఇతర నవలలు చదివిన వారు, చలం ని సమర్దించటం కోసం ఆమెను చలం కల్పనగా చెప్తారు. ఇలా జరగచ్చు కనక మీ పెళ్ళాలను ప్రేమ గా చూడండని చెప్పినట్లో, ప్రేమికుడు కూడా మగ వాడే కనుక వెళ్లి పోయిన తర్వాత కూడా సమస్యలు తప్పవనో చెప్పినట్లు గా అంటారు.

దైవ మిచ్చిన భార్య లోని పద్మావతి లా ఈమె సమాజం కోసం ప్రేమను కప్పివేయ లేదు. ఒకే ప్రేమికుడు కలదీ కాదు. అందునా ఆ ప్రియులూ ఈమకు తొడు పోయిన వారే సమాజం లో ఉన్నతులు కాదు.

అత్యంత వివాదాస్పదమైన ఈమె చలం జీవితం లో చూసిన స్త్రీల లో ఒక స్త్రీ కి రూపు మాత్రమే. చలం అద్రుష్టం కొద్ది నో దురదృష్టం కొద్ది నో సంఘం లో వెలివేయబడ్డ వారితో సహచర్యం చేసారు. (చెయ్య వలసి వచ్చిందన వచ్చు. ఈయన కూడా వెలి వేయ బడ్డ వాడె కదా ). ఈ ప్రక్రియలో ఆయన చూసిన స్త్రీ ల లోని ప్రేమ ఆయన్ను ఆశ్చర్యానికి గురి చేసింది . ప్రేమ తప్పితే మిగిలిన వన్ని కంటికి కనిపించని , మనసు మాట మాత్రమె వినే స్త్రీలను అయన గౌరవించారు.

రాజేశ్వరి ప్రేమ లేని చోటు నుండి ప్రేమ గల చోటుకి రావటం, ఆ చోటులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన మార్గమే సరైనదని అనుకోవటం మాత్రమె ఈ పుస్తక సారాంశం. ఆ పరిస్థితుల్లోకి మనం జొరబడి, ఇలా అయితే నేను ఎలా స్పందిస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. మన పక్క వీధుల్లోని రాజేస్వరులను రాళ్ళతో కొట్టక , వెనక వీధిలో మన్మధ రావు ని accept చేసినట్లు, accept చెయ్యమని. వేలైతే ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వమని ఆయన ఉద్దేశ్యం.

సమాజానికి అటువంటి స్త్రీలను పరిచయం చెయ్యటమే ఆయన ఉద్దేశ్యం. కోఠి లలో ఉండే స్త్రీలలో మనసు ఉంటుందని, వాళ్లు మామూలు చదువుకొన్న స్త్రీల కంటే మంచి వారని వచ్చిన ప్యాసా (మల్లెపూవు), ముకద్దర్ కా సికందర్, ఉమ్రావ్ జాన్ లాంటి వేళ కధాంశాల వంటిదే ఇదికూడా.

7 comments:

కత్తి మహేష్ కుమార్ said...

మైదానం విషయంలో చలం కు ఎవరి సమర్ధనా అక్కరలేదు. చలంని defend చెయ్యాల్సిన అవసరమూ లేదు.ఎందుకంటే చలం ను మీరి అస్తిత్వాన్ని తెచ్చుకున్న అన్ని రచనల్లాగే మైదానంకు కూడా ఒక అస్తిత్వముంది.ఒక ప్రత్యేకమైన అస్తిత్వముంది.

మైదానం అనైతికం అని గర్హించినా. అద్భుతం అని పొగిడినా. నిజంగా అలా జరుగుతుందా? అని ప్రశ్నించినా. అది నిజం కాదు కల్పన అని వివరించినా మైదానం కొచ్చే నష్టం ఏమాత్రం లేదు.

తరాలు చదివారు. తరాలు విభేధించారు. తరాలు ఆరాధించారు. ఇంకా చదువుతారు. మళ్ళీ అవే చేస్తారు. ఇలా మైదానం విశాలపడుతూనే ఉంటుంది. రాజేశ్వరి సమాజాన్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది.

భావన said...

మైదానం విషయం లో చలం ఏమి ఆశించి రాసేడు అనేది మనకు తెలిసిన చట్రం లో ఆకాశాన్ని బిగించటమేమో అనిపిస్తుంది నాకు.... చలాన్ని తెలిసిన ఒక వ్యక్తి గా విశ్వం గారు చలం మైదానం రాసిన పరిస్తితుల గురించి వుటకించారు ఓల్గా గారు చలం శతజయంతి సంధర్బం గా ప్రచురించిన పుస్తకం లో. http://chalam-kathalu.blogspot.com/2009/05/blog-post_11.html లో చూడండి. రాజేశ్వరి కి ఎవ్వరి గౌరవం అక్కర్లేదేమో ఆమె మాములు సామాజిక పరిస్తితులకు లొంగి గౌరవం అందులో మన్మధరావు కు ఇచ్చే గౌరవం లాంటివి ఆశించి వుంటే ప్రేమ కోసం మైదానం లోకి వెళ్ళేది కాదు... అందరిలానే సంపాదన లు చూసుకుంటు పట్టుచీరలు నగలు చూసుకుంటు రాత్రికి చేయబోయే వంకాయ పచ్చడి గురించి ఆలోచిస్తు వుండేది..
మీరు "కోఠి లలో ఉండే స్త్రీలలో మనసు ఉంటుందని, వాళ్లు మామూలు చదువుకొన్న స్త్రీల కంటే మంచి వారని వచ్చిన ప్యాసా (మల్లెపూవు), ముకద్దర్ కా సికందర్, ఉమ్రావ్ జాన్ లాంటి వేళ కధాంశాల వంటిదే ఇదికూడా. " అని ఏ వుద్దేశం తో అన్నారో నాకు తెలియదు కాని, చలం గారి దృష్టి లో ప్రేమ కోసం ప్రేమతో బతకని మనుష్యులందరు .. సరే ఇంక ఇక్కడితో ఆపేస్తా నా వ్యాఖ్యానం..

మైత్రేయి said...

@మహేష్ కుమార్ గారు, చలం ని కాదండి రాజేశ్వరిని దేఫెండ్ చేయాలని అనిపించింది. ఆమెకు మన సపోర్ట్ అక్కర లేదు అనుకోండి. తనే మనకు ఎనర్జీ ఇవ్వగల బలవంతురాలు.
@భావన, ప్యాస తో పోల్చటంలో నా కనిపించింది ఒకటే, మాములు జనాలు కూడా బోల్డంత జాలి చూపుతారు ఆ నాయికల మీద. పాపం ఎందుకో రాజేశ్వరి అంటే అందరికీ కోపమే.

కత్తి మహేష్ కుమార్ said...

@మైత్రేయి: నాదృష్టిలో రాజశ్వరి ఒక పాత్ర మాత్రమే కాదు. సమాజానికి చలం సంధించిన ప్రశ్న. అణగదొక్కబడిన స్త్రీత్వంపు శారీరక చైతన్యానికి ప్రతీక. సామాజిక రచనలో స్త్రీచైతన్యం మానసిక విచ్ఛిన్నతికి గురైతే ఎలా ఉంటుందో ఆవిష్కరించి సమాధానాల్ని కోరే సూటైన ప్రశ్న.

ప్రశ్నలకు డిఫెన్స్ ఉండదు. సమాధానాలు కావాలి. అవి ఈ సమాజం ఇప్పటికీ వెతకలేదు. భౌతికంగా కాకపోయినా మానసికంగా మైదానాల్ని వెతుకుతున్న స్త్రీలకు ఇప్పటికీ సమాధానం రాలేదు.రాజేశ్వరి ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. అందుకే రాజేశ్వరి ఎవరికీ నచ్చదు. సమాధానాలు ఇవ్వలేని ప్రశ్నలు ఎదురైతే ఎవరికీ నచ్చదు!

భావన said...

మరి కోపమే కదా జీవితాన్ని తన చేతులలోకి తీసుకుని తనకు ఇచ్చ వచ్చినట్లు వుంటాను అంటే.. నిజానికి అందరు చేసేది అదే.. అందరం... కాని సమాజం కోసం ఒక ముసుగు వేసి మనం చేసే పనులు సమాజానికి ఆమోద యోగ్యమనో... లేక చేసే పనికి కారణాలు చూపి సమాజం నుంచి జాలి కోసమో ప్రయత్నిస్తాము.. ఇంతా చేస్తే సమాజమంటె ఎవ్వరో కాదు మనమే.. చలం నాయిక లు ఎవ్వరు అలా చెయ్యరు.. మరి కోపమే కదా.

Vinay Chakravarthi.Gogineni said...

samaajam musugu enti.....manchi kaabatte ......adi oka maga vaadu chesina nenu tidataanu adadi chesina tidataanu........waste ga chalam alane andaru kavulu goppavaallu kaadu adi vaala opinion naku ayite tana opinion nachhaledu kaakapote ok writer society ni manchi vaipu mallinchali gaani edo confusion vaipu kaadu.........chalam ki clarity ledu andaru edo antunte chadivaanu........anta scene ledu daaniki.

మైత్రేయి said...

కంఫ్యూజన్ ఆయన రచనల్లో మాత్రమె లేదు. సమాజం లో ఉంది. సమాజ రీతుల్లో ఉంది.

ఆయన కు దొరకని, ఆయన కన్విన్స్ కాని సమాధానాలను ఆయన మన మీద రుద్ద లేడు. అందుకే ఉన్నది ఉన్నట్లు ప్రెసెంట్ చేస్తాడు.
సమాజం తో సద్దుకు పొమ్మని తమ మొండి క్యారెక్టర్లకు చెప్పి వాళ్ళను ఓటమి పాలు చెయ్యలేడు. అది తన రచనా ఉద్దేశ్యం కాని అతని ఉద్దేశ్యం కాని కాదు.
సమాజం ఎమన్నా తలచనీ మేమిలానే ఉంటాం అనుకోవటమో, సమాజం వీళ్ళను చూసి తమ పంధా మార్చు కోవటమో ఒకటి జరగాలి. ఆయన ఆశావాది కాక యదార్ధ వాది కనుక రెండవ ఎండింగ్ ఇవ్వడు. కొందరు రచయితల్లగా ఊహించి హ్యాపీ ఎండింగ్ ఎవ్వలేడు. ఎలాగు అలా జరగదని ఆయనకు తెలుసు. అందుకే మొదటి పద్దతిలో వదిలేస్తాడు. ఈ ప్రక్రియలో సమాజానికి , ఈయన నాయకీ నాయకులకు గ్యాప్ఉంటుంది.

It just leaves us with a question who is right? It gives you an opportunity to think from other side of the story. It is a struggle between 'Self' and 'Society'.

ఎక్కువ ప్రశ్నలు వేసుకొని శోధించు కోవటానికి మాత్రమె చలం పుస్తకాలు చదవాలి. సమాధానాల కోసం కాదు. అందరికి అన్నీ రుచులు నచ్చాలని లేదు. ఈయన రచనలు చేదు. కాని ఈ చేదు గుళికలు మనసు ఎదగటానికి మంచివి అని నాఅభిప్రాయం