అరుణ

"భర్త" ! ఆ మాట ముందు ఇష్టాలు, ధర్మాలు , హృదయాలు, స్వేచ్చాలు, ప్రేమలు, పాపాలు అన్ని తల వంచి తప్పుకోవలసిందే..
అన్ని మతాలు తల ఒంచ వలసిందే ఆ భర్త అన్న పదం ముందు. 
వాళ్ళు మాత్రం భర్తలు కారా? కాబోరా? సంసారపు హక్కుల్ని పునాదుల్ని ప్రశ్నించి ఎదురు తిరిగితే ఆడది? వాళ్ళ భార్యల మీద  హక్కులు నిలవాలా ? లేదా? 
అదే మగాళ్ళకు మగాళ్ళకు ఉండే కన్వెన్షన్ . ఫెయిర్ ప్లే . ఆ ప్లే లో ఆడది చేరదు.  అన్నీ మగాళ్ళ క్లబ్బులు.


స్వేచ్చ స్వేచ్చ అంటాం కాని మనని బంధించి నిలబెట్టే ఈ దేశం, సంఘం, కట్టుబాట్లు, మర్యాదలు, ఈ natural  laws  సరిగా పనిచేస్తున్నంత సేపే, మన స్వేచ్చ వాదాలు ప్రణయాలు. శరీరం సరిగా పనిచేస్తున్నంత సేపే అసత్యాలు శరీరపు నిబంధనలకి ఎదురు తిరగటాలూ! గంతులూ !

ఎన్ని కధలు రాస్తేనేం? కలలు కన్టేనేం? కబుర్లు చెప్తేనేం? భార్య భర్తతో వెళ్లనని ఎదురు తిరిగి గతి లేదని శరణు  చొస్తే..
అంతా ఎవరు ఆలోచించినా ఎంత ఆలోచించినా "నాకేం ఒరుగుతుంది , నాకేం లాభం లేదుకదా అనే కాని అమెకెట్లా ఉంటుంది అని కాదు."
"నా " అనేది మనసు నుండి వదలదు కదా.. 

స్త్రీల విషయం లో- అనుభవం - కొన్ని హక్కుల్ని, ఆ జన్మాంతపు హక్కుల్ని ఇస్తుంది పురుషుడికి.

చాలా సంస్కారం ఉన్న మనుషులే, ఎంతో విచక్షణ తో జీవితాన్ని చూడగల మేధా వంతులే, మనవ స్వభావాన్ని స్టడీ చేసిన పండితులే - స్త్రీ వ్యామోహం లో కాలు జారే టప్పటికి కళ్ళు కనబడక గోలుసువిప్పే వాడి చెయ్యి కరిచే కుక్కల్లగు వర్తిస్తారు..

మన ఇన్స్టింక్ట్ చేసే హడావిడి పైకి కనబడకుండా ప్రయత్నించటమే నాగరికతకు ఉండే ప్రధమ లక్షణం. 

3 comments:

  1. రెండు రోజుల నుంచి కామెంటు రాద్దామనుకుంటూనే వున్నా మన్నించాలి ఆలస్యానికి. మనిషి లోని ప్రాధమిక భావాలను ఇలా బట్ట బయలు చేస్తాడనే మరి చలమంటే అందరికి అంత కోపం. లేదు అవి ప్రాధమిక లక్షణాలు కానే కావు అంటారు ఏమంటాము సరే నండి మీరు ఈ భావాలకు అతీతులు అని నమస్కారం పెట్టి తప్పుకోవటం తప్ప. "స్త్రీల విషయం లో- అనుభవం - కొన్ని హక్కుల్ని, ఆ జన్మాంతపు హక్కుల్ని ఇస్తుంది పురుషుడికి." ఎంత నిజం కదు.. ఈ పురుషాదిక్య ప్రపంచం లో ఎంత పురుషాదిక్యత అంటే తనకు తెలియకనే స్త్రీ కూడా ఆ భావ జాలం లో ఇరుక్కుని తనకు తెలియకనే దాసోహమనేంత అందం గా అల్లిన భావ జాలం.. ఈ స్రీ వాదులను కొందరు ఫెమినిస్ట్ లను చూస్తుంటే అదే అనిపిస్తుంది వారికి తెలియకుండానే వాటిని ఎదిరిస్తున్నాము అనుకుంటూనే ఇంకా ఆ సాలె గూడు ను ఎంత గా పెంచి పోషిస్తున్నారు అని.
    అరుణ పేరు తో చలం సంధించిన అస్త్రం ఈ పుస్తకం.. నిజాలను కొంచం గా కవితరంగు ను పూసి కొంచం మార్చి తిప్పి చెపితే చేదు మాత్ర కు తీపి పూత పూసి రోగ గ్రస్తమైనప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఇదుగో నీకు తెలియటం లేదు కాని నీకు రోగమొచ్చింది చస్తావు కూడా ఈ మందేసుకో లేకపోతే నీ ఖర్మ అంటే మరి కష్టం గా వుంటుంది కదా. :-)
    ఏ పద్దతిన ఈ వివాహ వ్యవస్త మొదలయ్యిందో నాకు తెలియదు కాని, ఖచ్చితం గా ఒక మంచి పునాది తోనే ఆశయం తోనే మొదలయ్యి వుంటుందనుకుంటున్నా నేను కాని అది కొన సాగుతున్న విధానం చూస్తే ఎన్ని వేల చలాలు కావాలో తెలియ చెప్పటానికి.

    ReplyDelete
  2. అవును. చలం గారి చాలా మాటలు చిన్నవి గా ఉంటూ లోతైన అర్ధాల్ని ఇస్తాయి.
    ఆయన ఒక మగ వారై ఉండి, స్త్రీల గూర్చి స్త్రీల కంటే ఎక్కువ లోతుగా ఆలోచించ గలిగారు. ఎంతో మంది బాధ్యతగా, సానుభూతిగా ఆలోచించ గలరు కాని చలం ఒక్కరే మానవత్వం గా సమాన దృష్టి తో ఆలోచించారు అనిపిస్తుంది. ఆమె సున్నితత్వానికి, సౌందర్యానికి ఒక్కొక్క సారి ఎక్కువ విలువే ఇస్తారు పురుషుని కంటే.,
    చాలా మంది స్త్రీ సానుభూతి పరులు స్త్రీ వాదులమనే స్త్రీల తో సహా, స్త్రీలను రెండు గ్రూపులు గా చేస్తారు. వాళ్ళ దృష్టిలో 'మంచి' , 'చెడు' అని. 'మంచి' వారిని సమర్దిస్తూ అందరు స్త్రీలు ఇలా ఉండాలి అంటారు.
    చలం అలా కాదు తనకు కన్పించిన ప్రతి స్త్రీ ఉన్నతురాలు, ప్రేమ స్వరూపిణి ఆయన దృష్టిలో. ప్రకృతిలో సృష్టించ బడిన ఎన్నో సౌందర్యాలలో ఆమె ఒకతి.

    ReplyDelete
  3. ఇక వివాహ వ్యవస్థ గూర్చి మీరు ప్రస్తావించినట్లు అది మంచి కే ఏర్పరిచారు. అయితే ఆ కట్టు మనసులోనించి పుట్టవలసిన కట్టుబాటు. కేకలతో, తిట్లతో, అవమానాలతో స్త్రీలపై రుద్దవలసిన కట్టు కాదు.

    చలం, తర్వాతి కొందరు స్త్రీ అతి వాదుల లాగా రాముణ్ణి తప్పు బట్టలేదు. రాముడు రాజు, వాళ్ళ నాన్న కే ముగ్గురున్నారు ఆయన కు అప్పటికి ఇంకా పిల్లలు కూడా లేరు , ఆయన పెళ్లి చేసుకొంటే తప్పు పట్టే వాళ్ళు ఎవరూ లేరు కాని ఆయన ఏక పత్నీ వ్రతం ఆయన స్వయంగా స్వచ్చందంగా పాటించారు. అలాగే సీతా .. రాముడికి సీత, సీతకై రాముడు నిగ్రహించటం వారి మానసిక బంధానికి నిదర్శనం అని అది వాంఛనీయం అని అయితే దానిని బలవంతాన రుద్దటం సరి కాదు అన్నారు.

    ఇలాంటి మానసిక బంధాలు ఏర్పరుచుకొని కట్టు గా ఉన్న స్త్రీ పురుషుల వల్లే వివాహం అనే పదానికి ఇంకా విలువుంది గాని, పెళ్ళాలని కొట్టి అదుపులో ఉంచుతున్నాం అనుకొంటూ , దారిన పోయే ప్రతి ఆడదాన్ని వెకిలిగా చూస్తూ, 'తప్పు' చేసిన స్త్రీని బతికే వల్ల లేకుండా చేస్తూ మాట్లాడే సంఘోద్దారకుల వల్ల కాదు. అచ్చం బలవంతం గా నిలపాలనుకొంటే నిలవదు. కాలం లో కలిసిన ఎన్నో ఆచారాల మల్లే ఇదీ మరుగున పడేది.

    పురుషుల ఇన్స్టింక్ట్స్ ఉన్న గౌరవం స్త్రీలకు లేదు. ఆమె కూడా మనిషే గా.. నచ్చటం నచ్చక పోవటం తన మనసు బట్టి ఉంటుంది కదా అనుకోవటం ఎంత కష్టం ఈ రోజుల్లో కూడా..

    ReplyDelete