ఖయ్యాం రుబాయిలు

 చలం అనువదించిన ఖయ్యాం రుబాయిల్లోంచి కొన్ని..




<- భీమ్లి లోని  సౌ ఆశ్రమం (సాక్షి పుస్తకం నుండి..)

 పక్క మీద నేను ఇంకా కలలు కంటూ ఉండగానే
వినబడింది మహనీయమైన ఆ పానసాల లోంచి ఓ కేక
లేవండి పిల్లల్లారా లేవండి ఉదయమైంది
గిన్నె లోని జీవన మధువు ఎండి పోక ముందే గిన్నెల్ని నించుకోండి

నింపు, ప్రాణాన్ని మధువుతో నింపు
శీతాకాలపు పశ్చాత్తాప వనాన్ని వసంతాగ్ని లో మంటబెట్టు
నింపు నా పాత్రను నింపు.
కాల విహంగానికి నా జీవిక పధం లో ఎగరటానికి
ఎంతో దూరం లేదు.

పక్షి రెక్కల వేగం పెంచింది చూడు.  అంతాన్ని  సమీపిస్తుంది.
నా జీవిత పాత్రని మధువుతో త్వరగా నింపు
చెట్ల మీద, కంచెల  నిండా, ఉదయాన్నే ఎన్ని పూవులు
విచ్చుకొని, గాలిలో నవ్వుతున్నాయో చూడు
పక్కనే ఎన్ని అందమైన పూవులు వాడి,
ధూళిలో నశించాయో అదీ చూడు.

3 comments:

  1. చాలా బాగుంటాయి కదు ఈ రుబాయి లు. చలం గారి వి బాగుంటాయి దాశరధి గారి అనువాదం కూడా బాగుంటాయి.
    కాల విహంగానికి నా జీవిక పధం లో ఎగరటానికి ఎంతోదూరం లేదు... నింపు ప్రాణాన్ని మధువు తో నింపు... కొన్ని అందాలు బలే విచిత్రమైన రూపం లో తడతాయి మనసు కు.. ఒంటరి గా శీతాకాలం మధ్యాన్నం గన్నేరు చెట్టు కింద నడిచి వెళుతుంటే కదిలి కొమ్మతో కలిసి వచ్చే మధురమైన వగరు పరిమళం...కదిపే జ్నాపకం ఈ రుబాయి లు... చలం కలం బలం తో మరింత విచ్చుకుని నవ్వుతూ, దడి వెంబడి సోమరి గాలితో కలిసి పక పక మన్న కాశీరత్నపు కొమ్మ లోని ఎరుపు చురుక్కుమనిపించారు మైత్రేయి.. :-) థ్యాంక్స్.

    ReplyDelete
  2. మైత్రేయి గారు మి పోస్ట్ చూసాక మళ్ళి ఒకసారి రుబాయిలు ఆస్వాదించాను.సౌరిష్ గారి ఆశ్రమం లోని చలం గారి పెద్దపొటో లాంటి పొటో ఒకటి చేపించుకోవాలండి.

    ReplyDelete
  3. Thanks Bhavana.
    Raghu garu, Thanks to Bhanu who shared the pdf.
    I lost touch with all you guys after our Orkut days. :). not getting time for anything..

    ReplyDelete