చలం గారి రచనలను మూడు రకాలు గా విభజించవచ్చు.
1. ప్రకృతిని, స్త్రీని, ప్రేమను అందం గా అవిష్కరించేవి.
శశిరెఖ, పురూరవ, దైవమిచ్చిన భార్య, మైదానం , ప్రేమ లెఖలు మొదలైన నవలలు నాటికలు, చుక్కమ్మ, కళ్యాణి వంటి కధలు
2. సమాజం లోని వికృతాలను వ్యంగ్యంగా విమర్శించేవి.
మ్యూసింగ్స్, జెలసి , ఆనందం, విషాదం మొదలైన పుస్తకాలు, రామభక్తుడు, అట్లపిండి, విచిత్రనళియం వంటి కధలు
3. అంతర్ముఖుడై భగవంతుని శరణాగతిని, వైరాగ్యాన్ని భొధించేవి.
ఖయ్యం రుబాయిలు, గీతంజలి, భగవద్గీత, రమణ శ్మృతులు మొదలైనవి
అయితే అన్నిట్లో చలం ముద్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకే వ్యక్తి ఇవన్నీ రాసారంటే వింతగా ఉండదు. ఆయా పరిస్తితుల్లో వయసులో తను ఎమైతే నిజమను కొన్నారో ఎదైతే నమ్మరో అదే రాసారు. అన్ని రచనల్లొ అంతర్లీనం గా కనిపించెది (1 ) స్వేచ్చా వాదము, (2 ) డబ్బు పదవులపై కాంక్ష, కుల మత అసమానతలు కూడదనే మానవతా వాదం, (౩) స్త్రీ పట్ల దయ. (4 )ప్రకృతి ఆరాధన.
ఈ పుస్తకాల రచనా కాలాలు చూస్తే మొదటివి ఆయన ఇరవై ఏళ్ల వయసు నుండి యాభై వరకు స్త్రీలతో పిల్లలతో ఉత్సాహం గా రాజమండ్రి, కాకినాడ, భిమ్లి, గుంటూరు, విజయవాడ ల లో గడిపిన రోజుల్లో రాసినవి గా, తరవాతవి యాభై నుండి అరవై మధ్య పిల్లలు పెద్ద వాళ్ళయి విజయవాడ, ఎలూరుల్లో ఆరోగ్య, కుటుంబ సమస్యల్లో ఉండగా వ్రాసినవి గా, తర్వాతవి కొంత గాప్ తో అరుణాచలంలో వ్రాసిన పుస్తకాలు గా తెలుస్తాయి
చలం ఆశ్రమ వాసి అయ్యెవరకు స్త్రీ అంటే ఆకర్షణ కూడా ఉండేది, అమెను పురుషుణ్ణి ఉద్ధరించ టానికి పుట్టిన ఉన్నత వ్యక్తి గా ఆరాధించారు. అదే వారి నిజ జీవితంలొ, రచనలల్లొ కనిపించేది. అయితే తర్వాతి కాలం లొ అమే తనవంటి బలహీనురాలే నని, బలమైన వాడు, ఆధార పడ దగ్గ వాడు భగవంతుడు ఒక్కడె నని తెలుసు కొని నమ్మి అదే వ్రాసారు అంతకంటె ఎక్కువ తేడా పాత రచనలకు కొత్త రచనలకు నాకు తోచదు. పైగా ఇది ఎందరో మహానుభావుల విషయంలొ సహజమైన పరిణతి. . అయితే స్త్రీల పట్ల ఆయనకు ఉన్న జాలి, అభిమానమాల్లో మార్పు లేదు. అనాధ స్త్రీలను ఆదరించటం ఆయన రమణాశ్రమం లో కూడా కంటిన్యూ చేసారు.
అలాగే సమజం పోకడల పట్ల ఆయన వుద్దెశ్యాల్లొ పెద్ద మార్పు అంత్య కాలం లో కనిపించదు. అయితే వైఖరి లొ మార్పు కనిపిస్తుంది. ఆవేశం తగ్గి, తప్పు చేసిన వారిని, వారి దుర్గుణాలను వేరు చేసి చూడటం కనిపిస్తుంది.
అయన మొదటి రచనల్లో కూడా ప్రేమ లో అంతర్లీనం గా ఉండే వైరాగ్యాన్ని చూస్తే ఆయన చివర్లో యోగి అవ్వటం అతి సహజమైన విషయం గా తోస్తుంది. పురాణం సుబ్రమణ్య శర్మ గారు వ్రాసిన చలం పుస్తకంలో చలం బ్రహ్మ సమాజం లో ఉన్నప్పుడు నిర్గుణోపాసనను, బ్రహ్మ సిద్ధాంతాలను సమర్ధిస్తూ వ్రాసిన వ్యాసం చదివితే అంత చిన్న వయస్సులో ఆయనకు ఉన్న డెప్త్ తెలుస్తుంది. ఆయన అల్లాటప్ప స్త్రీ లోలుడు కాదు అన్న విషయం అర్ధమవుతుంది.

చాలా బాగా ఎనలైజ్ చేసేరు మైత్రేయి. కంగ్రాట్స్. కాని ఆయన మొదటి దశలో స్త్రీ ని అభిమానించి ఆరాధించినా ఆమె ప్రేమ మీద విశ్వాస ముంచినా ఎప్పుడూ ఆ ప్రేమ ను మించి, వున్నతమైన దిక్కు కోసం నిరంతరం చూపు శూన్యం లోకి సాగుతూనే వుండేది అనిపిస్తుంది ఆయన రచనలు చూస్తే. అవును ఏ విషయం లోను అల్ల టప్పా కాదు ఏది చేసినా పూర్తి నమ్మకం తో చిత్తశుద్ధి తో చేసేరు కాని మళ్ళీ ఆ అనుమానం ఆయన ను ఆ దశ నుంచి పై దశ కు తీసుకువెళ్ళటానికి వుపయోగ పడిందే మో అనుకుంటా నేను. బాగుంది మైత్రేయి.
ReplyDeleteచలం గార్ని ఎనలైజ్ చేసే అంత దాన్ని కాదని తెలిసీ రాయాలనిపించింది. అందరికీ ఏమో కాని చలం గారి అభిమానులు మాత్రం చిత్రం గా ఉంటారు.
ReplyDeleteఒక గ్రూప్ ఆయన ఆవేశాన్ని మాత్రం ఇష్టపడుతుంది వారు ఆయన ఆశ్రమం లో చేరి తప్పు చేసాడంటారు. మరో గ్రూపు ఆయన మొదటి హాఫ్ కంపు తర్వాత భాగం మాత్రమే తీసుకోవాలి ఆయనే, చివర్లో అలాంటి రచనలు చేసినందుకు బాధ పడ్డాడు అంటారు. ఈ రెండూ కరెక్ట్ కాదని ఆయన మొదటి జీవితం ఎంత ఇష్టం గా గడిపారో అంతే ఇష్టం గా, స్వేచ్చ గా రెండవ భాగం గడిపారని, దేనికి పశ్చాత్తాప పడిన సూచనలు కాని, ఎవరి బలవంతాన బతికిన సూచనలు కాని లేవని ఆయన ఆకాశవాణి ఇంటర్వ్యూ విన్నా, ఆశ్రమం లో ఉండగా రాసిన తన ఆత్మ కధ "చలం", ఆయన మిత్రుల ఉత్తరాలు చదివినా తెలుస్తుంది.
ఆయన్ను మొత్తం గా అర్ధం చేసుకోవటానికి, అప్పటి సాంఘిక పరిస్థితుల నేపధ్యం లో ఆయన జీవితం చూడటానికి పురాణం సుబ్రమణ్య శర్మగారు, వజీర్ రహ్మాన్ లాంటి కొందరు మాత్రమే ప్రయత్నించారు.
నా దృష్టిలో ఆయన మేధావి, సున్నిత మనస్కుడు, సంఘం గూర్చి ఆలోచించి ఏదో చెయ్యాలన్న తపనతో బతికిన ఆ నాటి తరం లోని ఎందఱో ప్రముఖుల్లో ఒకడు. ఈ ప్రాసెస్ లో తన జీవితాన్నే ప్రయోగ శాల చేసుకొని ప్రయోగాలు చేసుకొన్నారు. తను నమ్మింది పాటించి చెప్ప చూసారు. సౌ లాంటి గొప్ప కూతురికి గర్వ పడే తండ్రి, డా. రంగనాయకమ్మ గారి జీవితాన్ని మలచి డాక్టర్ ని చేసి, వాళ్ళ హాస్పిటల్ ద్వారా ఎందరికో ఆశ్రయం ఇచ్చిన ఆయన జీవితం లో అంత ఫైల్యూర్ ఏమి కాదు. శ్రీ శ్రీ, రంగనాయకమ్మ గారు, కొ కొ లాంటి ఎందఱో ఆయన వల్ల ప్రభావితులైన వారు, కొందరు పైకి చెప్తూ కొందరు చెప్పక. ఈనాటికీ మంచికో చెడుకో ఆయన్ని మర్చి పోలేకపోతున్నారు జనం.
అవును మైత్రేయి చలం గారి అభిమానులు చిత్రం గా వుంటారు అది నిజం.. నాకు మాత్రం మొత్తం గా చలం ఏ కోణమైనా నచ్చినట్లు అనిపిస్తుంది. దూరం గా నుంచుని చెపుతావు కాబట్టి అలా అంటున్నావు అదే ఆ కాలం లో వుండి చూస్తే నచ్చేవి కావేమో కొన్ని అంటారు స్నేహితులు ఏమో అవునేమో కాని ఆ పాజిబిలిటీ లేనప్పుడూ అలా వుండేదేమో అనే వూహ ఎందుకు. ఆయన జీవితం లో అస్సలు ఫైల్యూర్ కాదు అనుకుంటా. నిజం అనేది అంత గా ఆచరించి చూపిన ఒకే వ్యక్తి మాములు సమాజం లో అనుకుంటా, ఆయన వుత్తరాలను బట్టీ దీక్షితులు గారు అంతటి ప్రజ్నా శీలి అని అర్ధం అయ్యింది. ఇంక సమాజం లో సాధరణ స్థాయి లో వుండే మనుష్యు ల లో అంత గా నిజాని నమ్మి ఆచరించిన వారు ఎవరున్నారు చెప్పండి. గొప్ప వారైన గాంధి గారే వ్యక్తి గతం నుంచి రాజకీయానికి వచచే సరికి కొన్ని సర్దు బాట్లు తప్పలేదు. ఇంక స్త్రీ లోలుడంటారా.. ఏమో నేను ఒప్పుకోను ఎంద్అరు ఎంతగా వాదించినా అది లోలత్వమా ఏమో.. ఏది ఏమైనా ఆయనది స్త్రీ లోలత్వమని విమర్శించే వాళ్ళను చూస్తుంటే మాత్రం ఆయన కు సరి రాని వారు ఇలా మాట్లాడతారేమా అని పరిహాసం గావుంటుంది నాకు. ఆయనను ఎప్పటికి సాహిత్య సమాజం మర్చిపోదు. మర్చి పోలేదు కూడా.
ReplyDeletehii.. Nice Post Great job.
ReplyDeleteThanks for sharing.
Best Regarding.
More Entertainment