నరాలను మీటుతూ అక్షరాలను మ్రోగించిన అనుభవ సంవేదన చలం శైలి.
చలం స్త్రీని భోగిలా రమిస్తూ యోగిలా దర్శిస్తూ ఉంటాడు. ఇది విరోధాభాసం లాంటి విన్యాసం. ఈ విరోధాభాసాన్ని తొలగించి, ఈ రెండిటినీ సమన్వయం చేసింది చలం సౌదర్యదర్శనం.
దేహ సంబంధంలేని స్నేహానికి ప్రాధాన్య మిచ్చే రాయప్రోలు వారి అమలిన శృంగారం కానీ, దేహ సంబంధాన్ని ఆత్మ సంబంధంతో నియంత్రణ చేసుకొనే విశ్వనాధ వారి కులపాలికా ప్రణయం గానీ, దేహ సంబంధం లేని కాల్పనిక కళావేదనగా నినదించే కృష్ణశాస్త్రి గారి ఊహా ప్రేయశి మధుర ప్రణయం గానీ, త్రికరణ శుద్దిగా కలసి మెలసి ఉండే నాయని నండూరిల వలపు జంటల ముగ్ధ ప్రేమలు కానీ చలంగాని మనో మార్గానికి సంబంధించిన వి కాదు.
-జి.వి. సుబ్రమణ్యం గారు (వావిలాల సుబ్బారావు గారి ధీసీస్ లో ముందుమాట)
-------------------------------------------------------------చలం గూర్చి శ్రీ B. V. నరసింహ రా గారు చెప్తూ , (ref ఆడియో లింక్ )
సంఘం గూర్చి..
చలం సంఘ విరోధి కాదు. సంఘ మిత్రుడు.
సంఘ ద్వేషి కాడు. సంఘ సంస్కర్త .
సంఘాన్ని తిడుతున్నాడంటే సంఘం లోని దుర్మార్గుల్ని వంచకుల్ని అతడు తిడుతున్నా డన్న మాట .
హృదయమున్న వాళ్ళకే కదా అతని మొర అంతా.
స్త్రీ గూర్చి
స్త్రీ శక్తి ని ఆరాధించటం వల్ల ప్రేమకు ఆద్యత్మికోన్నతి సిద్దిస్తుందని, స్త్రీ శక్తిని ఆరాధించటం దివ్య శక్తిని ఆరాధించటానికి
తోలిమెట్టని వివరించారు.
స్త్రీ కొరకే కాక తన కొరకే పురుషుడు తన లోని పశు ప్రవృత్తిని తొలగించు కొనుట కొరకే స్త్రీ ని కి స్వేచ్చ నివ్వాలని ఆరాధించాలని చలం గారి అభిమతం.
-------------------------------------------------------------
బెర్ట్రాండ్ రుస్సేల్ లోని తెగువ, సౌందర్యారాధన, శరత్ బాబు లా సున్నిత మైన ప్రేమ ను ఆవిష్కరించటం, టాగోర్ లోని నిర్మల మైన ఆద్యాత్మికానందం, శ్రీ శ్రీ ని మించిన ఆవేశం ఓకే వ్యక్తీ లో చూడాలంటే అతను చలం.
వీరి ఉద్దేశ్యాలను అంగీకరించిన వారికి, అంగీకరించని వారికి కూడా వారి అభిప్రాయాలను చదవటం, ఆత్మావలోకనం చేసుకోవటం ఒక మంచి మానసిక వ్యాయామం..చలం ఎవరు అంటే..
ప్రకృతికి, ప్రేమ కు మాత్రమే చలించే ఒక ... పసి పిల్లాడు ..మామూలు మనిషి
భగవంతుని నుంచి వేరై భూమి మీద పడ్డాక ఆ భగవంతుడు తప్పితే, ఆయన రూపం ఎవరిలో అయితే, దేనిలో అయితే కొంచం ఐనా కనిపిస్తున్దో వారు తప్పితే ఎవరూ, ఏదీ నచ్చక ఇబ్బంది పడ్డ ఒక ఆత్మ..
ఆ ఆత్మ మీలో నాలో అందరి లో ఉన్నది.. మనం తెలివితో, మూర్ఖం గా దాని నోరు మూసాం అంతే....
చలం ఎ రూపం లో పైకి కన్పించినా మొదటి నించి చివరదాకా ఒకటే సౌందర్య అభిలాష, దేనికోసమో తపన.
తాత గారికి ఇష్టుడైన మనవడిగా నిష్టాగరిస్తుడైన బ్రహ్మచారి గ ఉన్నప్పుడు , బ్రహ్మా సమాజం లో అమిత ఉత్సాహం తో తిరిగినప్పుడు , స్త్రీ చుట్టూ తిరుగుతూ సమాజం తో తిట్టిచ్చు కొన్నప్పుడు , రమణాశ్రమం లో ప్రశాంతం గ ఋషి జీవనం గడిపినప్పుడూ ఎప్పుడూ ఒకే ఆర్తి , చుట్టూ ఉన్నవి కాదని దేనికోసమో వెతుకులాట.....
----------------------------------------------------------
చలాన్ని చదివితే యేమొస్తుంది? ఎంత లాభం అంటే అంకెల్లో చెప్పడం అసాద్యం. మన జీవిత గమనాలను మన జీవితాల గురించి మనకు అశాంతి కలుగుతుంది. మన శరిరంలోను, మెదడులోనూ పేరుకున్న కొవ్వును కరిగించుకొవాలనిపిస్తుంది. ఎందుకు తీస్తున్నామో తెలియకుండా తీసే పరుగులు ఆపి, గుండెలనిండా గాలి పిల్చుకుని రక్తశుద్ది చేసుకోవాలనిపిస్తుంది. స్వేచ్చ, బాద్యత ఒకదానికొకటి విరుద్దమైన విషయాలు కావని, ఒకే నాణానికుండే రెండు వైపులని చలం మనకు పదే పదే గుర్తుచేస్తారు. అలాగే ఆనందనికి వ్యతిరేక పదం త్యాగంకాదు. అవి రెండూ విరుద్ద భావనలు కావు.. ఈ విషయాన్ని అర్దం చేసుకొని హృదయాలను విశాలం చేసుకొమంటుంది చలం సాహిత్యం + చలం జీవితం.
--Raghavendra
--Raghavendra
